జర్నలిస్టుల కరోనా ట్రీట్మెంట్ ఖర్చులు ప్రభుత్వానివే

జర్నలిస్టుల కరోనా ట్రీట్మెంట్ ఖర్చులు ప్రభుత్వానివే

కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ప్రాణాలనును కూడా లెక్కచేయకుండా .. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా కల్పించేలా గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు .. వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందవచ్చునని తెలిపారు.

అంతేకాదు ఇప్పటికే కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన కుటుంబాలకు నెలకు రూ.5,000 చొప్పున పింఛను మంజూరు చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మే 13న ప్రకటించారు.